గత ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయిన విషయం తెలిసిందే. విభజనాంధ్రప్రదేశ్ కు అనుభవమైన సీఎం ఉండాలి అప్పుడైతేనే రాష్ట్రం సంక్షోభం నుండి ఈదగలుగుతుంది అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి అధికారం చేజిక్కించుకున్నాడు. ఇక రాజధాని అమరావతి నిర్మాణం వంటి భారీ పాజెక్టులు చేపట్టి తన అనుభవంతోనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి అని ప్రజలలో ఒక భావనను కలిగించేలా చేశాడు. ఇదే ఫార్ములను వాడి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు, వచ్చే సూచనలు కూడా కనిపించాయి.


కానీ గడిచిన 2 వారాలలో రాష్ట్ర రాజకీయాల సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడమే గాక తీవ్ర అన్యాయాన్ని చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న వేళ జగన్ ఒక అడుగు ముందుకేసిమరీ ప్రత్యేకహోదా విషయమై తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి ప్రజల్లో మంచిమార్కులే కొట్టేసాడు. దీంతో ప్రత్యేకహోదా కోసం వైసీపీ మాత్రమే పోరాడుతుంది అని హైప్ సృష్టించి టీడీపీ ని ఎన్నికల ఫేవరెట్ నుండి తొలిగిపోయేలా చేసి సఫలమయ్యాడు.


ఇటీవల కేంద్రంపై అవిశ్వాసతీర్మానం అంటూ మరోసారి తెలివైన అస్త్రం ప్రయోగించాడు. దీంతో బాబు కూడా తను ప్రత్యేకహోదా కి ప్రయత్నిస్తున్నాను అని జనాలకు తెలిసేలా ఉండటానికి కొత్త స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన అన్న మాటలే ఇందుకు నిదర్శనం.కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంటే మాటలు కాదు, దీనికి పెద్ద వ్యూహాలు కావాలి. త్వరలోనే అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. అంటే జగన్ తో భేటీ అవబోతున్నాని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే దీనిపై మోడీ మల్లగుల్లాలు పడుతున్నాడంట. ఏపీలో ఎవరో ఒకరి మద్దతుతో పాగావేయాలనుకున్న మోడీకి ఇది మతిపోయే విషయమే. వీళ్లిద్దరూ కలిస్తే ఇక బీజేపీ తుడుచుకపోతుంది. అందుకే ఢిల్లీలో ఉంటూ ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటున్నాడంట.  


మరింత సమాచారం తెలుసుకోండి: