ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నినాదాలే వినిపిస్తున్నాయి.  విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదు.  అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఎన్నికల బరిలో నిలబడిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగిస్తుంది..అందరూ ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తారని భావించారు..కానీ దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అంటూ తెరపైకి తీసుకు వచ్చారు.  దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు మాత్రమే కాదు ప్రజలల్లో కూడా కేంద్రంపై అసంతృప్తి నెలకొంది. 
Image result for modi chandrababu
దీంతో టీడీపీ కాస్త ఆలోచనలో పడింది..వచ్చే ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగితే..డిపాజిట్లు కూడా రావని భావించింది.  దీంతో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కేంద్రంపై తిరగబడే పరిస్థితి వచ్చింది.  దీంతో ఏపీలో బీజేపీ, టీడీపి మద్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ, బీజేపీ కటీఫ్ ఖాయమేనా.. ఇక ఆ రెండు పార్టీలూ కలిసి నడిచే అవకాశం లేదా.. అంటే అవుననే అనిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీలో వస్తున్న మార్పులు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికే సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇతర టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల తీవ్రత ఆ పార్టీ పొత్తును తెంచుకోవడానికే సిద్దమైనట్లు బలంగా కనిపిస్తోంది.

Image result for ap special status

అటు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా దీనికే ఫిక్సయిపోయారు. టీడీపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయడం వెనుక వ్యూహం కూడా అదేనని అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితి ఇక్కడి వరకూ రావడానికి బీజేపీలో వెంకయ్య వంటి నేతలు రాకపోడవమే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. 

Image result for ap special status

మోదీ అడిగితే ఇస్తారు తప్పితే... ఒత్తిడి చేస్తే అస్సలు లొంగరని, టీడీపీ ఆ విషయాన్ని గుర్తెరగాలంటున్నారు. దీనికి తోడు టీడీపీ, బీజేపీ పోటాపోటీగా బుక్ లెట్లు విడుదల చేయడం కూడా పరిస్థితిని మరింత జటిలం చేసింది. టీడీపీ బుక్ లెట్లోని కొన్ని విషయాల్లో కేంద్రం పైసాకూడా ఇవ్వలేదని చెప్పడాన్ని పీఎంఓ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.  ఆంధ్రప్రదేశ్‌ పత్రికల్లో వచ్చే ప్రకటనలు, సంపాదకీయాల అనువాద కాపీలు రోజూ పీఎంఓకు వెళ్తున్నాయట. 


ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యకుదిర్చే పెద్దమనుషులు కూడా లేరు. చొరవ తీసుకొని ప్రధానిమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాకు చెప్పేసా‌యి నాయకులు లేరు వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకునేవారు.. వివాదాలు రాకుండా ఇరువర్గాలకూ జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధహోదాలోకి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: