కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి తెర వెనక నుండి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో మైనింగ్ కేసుల్లో కేసులో ప్రధాన నిందితుడు అరెస్టయిన క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి తన సొంత ప్రాంతం బళ్లారి లో అడుగు పెట్టడానికి వీల్లేదు కోర్టు ఆదేశాల ప్రకారం. ఈ క్రమంలో  గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో నివాసం ఉంటున్నారు.


అయితే ఎన్నికల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి తన సొంత ప్రాంతం బళ్లారి లో అడుగుపెట్టకుండా బయటి నుండే చక్రం తిప్పాలి అని పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ విజయానికి కృషి చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు గాలి. ఈ క్రమంలో  గాలి జనార్దన్ రెడ్డి తన మద్దతుదారుల తో ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు గతంలో గాలికి దగ్గరగా ఉన్న మనుషుల చాలామంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.


అయితే గతంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గాలి జనార్దన్ రెడ్డికి పార్టీకి సంబంధం లేదని ఇంతకుముందు ప్రకటించడం జరిగింది….అదంతా ప్రజల ముందు.. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా బయట నుండే గాలి జనార్దన్ రెడ్డిని భాజపా పార్టీ వాడుతున్నారట. ఈ మొత్తం  విషయాన్ని ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది.


గాలికి బళ్లారి ప్రాంతంలో ఉత్తర కర్ణాటక లోని పలుజిల్లాల్లో బాగానే పట్టుంది. ఈ సందర్భంగా గాలి సాయం తీసుకుని ఆయా ప్రాంతాల్లో లబ్ధిపొందాలనేది భాజపా వ్యూహం. ఈ  క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా నేరుగా రాజకీయాలలోకి ఎంట్రి ఇచ్చే అవకాశం లేదు కనుక బిజెపి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాడు...భారతీయ జనతా పార్టీ గెలుపుకు. ఈ  విధంగానైనా రాజకీయాలలో చక్రం తిప్పాలని గాలి జనార్దన్ రెడ్డి కోరిక అన్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: