ఏపీకి  ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. అసలు హోదా అనే పదం ఉండబోదంటూ పార్లమెంట్ సాక్షిగా నమ్మబలికింది. దీంతో చంద్రబాబు  కూడా ప్యాకేజీకి ఓకే అన్నారు. పేరు ఏదైనా రాష్ట్రానికి సాయం అందితే చాలని భావించారు. అంతిస్తా ఇంతిస్తాం అన్న కేంద్రం ఇప్పటివరకూ ఏమీ విదిల్చలేదు.  స్థాయిని మర్చిపోయి సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగించారు. అంటే ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా ఇచ్చిన మాట అబద్ధమని తేలిపోయింది. దీంతో దగాపడ్డామని చంద్రబాబుకు అర్థమైంది.

Image result for andhrapradesh

చంద్రబాబుకు ఓర్పు నశిస్తోంది. ఇంతకాలం కేంద్రం నుంచి సాయం అందుతుందని చూసిన ఎదురుచూపులు ఫలించకపోవడంతో ఆయనలో సహనం చచ్చిపోతోంది. మిత్రపక్షం బీజేపీ మాట నమ్మి నాలుగేళ్లు వేచి చూసిన ఆయన ఇక సాయం అందదేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. దీంతో స్వరం పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా మాట్లాడుతున్నారు. నిజానికి మొన్నటిదాకా ప్యాకేజీకి ఓకే అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా మాటెందుకు ఎత్తుతున్నారు...? ఇక మొండిగా ముందుకెళ్లాలనే ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అంతో ఇంతో సాయం అందకపోతుందా అని ఓర్పుగా చూసిన ఆయన ఇక పోరాట బాట పట్టనున్నట్టు చెబుతున్నారు. 
Image result for ap special status
చంద్రబాబు వ్యూహం కూడా వేరేలా ఉంది. నమ్మి నట్టేటముంచిన బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై అవినీతి ముద్ర ఎలాగూ  ఉంది. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికోసం పడుతున్న తపన ప్రజల కంటికి కనబడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయమని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి మిత్రపక్షాలను కాదనే పరిస్థితి ఉండదు. అప్పుడు అవసరమైన సాయం కోసం టీడీపీవైపు చూడక తప్పదు. అదే చంద్రబాబు ధైర్యం. అందుకే ఇక మొండిగా వెళ్లాలని భావిస్తున్నారు.
Image result for babu modi
పైగా ఎన్నికలకు ఏడాదే ఉండటంతో ఇక కేంద్రం నిధులు నిలిపివేయడం లాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలు తక్కువే.  సాయం ఏదైనా ఓకే అన్న చంద్రబాబు ఇప్పుడు ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రత్యేక హోదా ఉండదని చెప్పిన కేంద్రం వేరే రాష్ట్రాలకు దాన్ని ఎలా పొడిగించింది. దీనికి తోడు ఇప్పుడు బుందేల్ ఖండ్ కు 20వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అంటే సాయం కోసం అడుక్కుంటున్న రాష్ట్రాన్ని వదిలేసి  యూపీకి వరాలు కురిపించారు.
Image result for bjp tdp
ఎందుకంటే అక్కడున్నది సొంత పార్టీ ప్రభుత్వం. ఇక్కడున్నది మిత్రపక్షం. దీంతో చంద్రబాబుకు సహనం నశించినట్లే కనిపిస్తోంది.ఏపీకి సాయం చేయని బీజేపీతో కలిసేందుకు వైసీపీ పడుతున్న తాపత్రయం, దానివెనకున్న కారణం కూడా ప్రజల్లోకి వెళ్లింది. ఈసారి ఎన్నికల్లో ఇదే స్థాయిలో లోక్ సభ స్థానాలు గెలుచుకుంటే కేంద్రాన్ని గడగడలాడించొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మోడీ మానియా 2014లో ఉన్నంత ఇప్పుడు లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: