రాజధానిలో సిటీ కోర్టు, ఐటీ టవర్‌ భవనాల డిజైన్లు రెడీ అయ్యాయని, ఆన్‌లైన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ఎంపిక చేసిన వాటినే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.ఇప్పటికే ప్రజాభిప్రాయసేకరణకు ఆన్‌లైన్‌లో పెట్టింది. అత్యధికుల ఎంపిక చేసిన డిజైన్లను ఓకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.

సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగింది.
City Court, IT Tower Designs was ready - Sakshi
ఈ సమావేశంలో సిటీ కోర్టు నిర్మాణానికి 12 డిజైన్లు, ఐటీ టవర్ కోసం 19 డిజైన్లను ఆర్కిటెక్టర్లు రూపొందించిన వాటిని సీఎం చంద్రబాబునాయుడుకు చూపించారు.ఇప్పటివరకూ 3 వేల మంది డిజైన్లను తిలకించారని, మరో రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నామని ఆయన తెలిపారు.
IT towers
ఆ తరవాత అత్యధికుల ఎంపిక చేసిన డిజైన్లను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లతామన్నారు. రూ.372 కోట్లతో వెయ్యి కోట్లతో.. అమరావతి రాజధాని పరిధిలో వేగవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లను సొంతంగా నిర్మించనుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
city court
ఈ అపార్టుమెంట్లను 2, 3 బెడ్‌రూమ్‌లుగా నిర్మాణం చేపడతామన్నారు. అవి పూర్తికాగానే, ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామన్నారు. వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణంతో అక్కడి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్ ఏర్పాటవుతాయన్నారు.
IT towers
ఐఏఎస్, ఐపీఎస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం చేపట్టిన 3,840 అపార్టుమెంట్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. విజయవాడలో ఉన్న కాలువల పక్కన చేపట్టిన గ్రీనరీని రెండు నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని నారాయణ తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: