2014 లో అధికారం లోకి వచ్చేది వైసీపీ అని, అన్ని సర్వేలు ఘంటాపధంగా చెప్పాయి. అయితే 2014 లో కొంచెం ఓట్ల తేడా తో అధికారాన్ని చేజార్చుకున్నది. కాగా గత ఎన్నికల్లో జగన్ పార్టి ఓటమికి ఒక్కోరు ఒక్కో కారణం చెబ్తున్నారు. తాజాగా వైసీపీ నేత భూమా నాగిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జగన్‌ సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ ఓడిపోయిందని, ఎన్నికల సమయానికి పార్టీ అడ్మినిస్ట్రేషన్  పూర్తిగా విఫలమైందన్నారు.
Image result for jagan
అనంతపురం జిల్లాలో దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమిటంటే… ఇద్దరు ముగ్గురు జిల్లా ఇన్‌చార్జ్‌లను నియమించారని దాని వల్ల ఒక్కో ఇన్‌చార్జ్ ఒక్క జాబితాను తెచ్చి జగన్‌ ముందు పెట్టారనగా, దీంతో వలన మూడు నాలుగు గ్రూపులు తయారయ్యాయి. మొదట నన్ను ఇన్‌చార్జ్‌గా నియమించి తర్వాత మరో ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారన్నారు. పైగా విశాఖలో మోదీ హవా నడుస్తున్న సమయంలో, అక్కడ విశాఖలో లక్షన్నర మంది నార్త్ ఇండియన్ ఓటర్లు ఉన్నారని తెలిసి కూడా విజయమ్మను నిలబెట్టడం రాంగ్ డిసిషన్ అన్నారు.
Image result for jagan
విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేస్తారన్న విషయం అంతకు ముందు పార్టీలో ఎవరికీ తెలియదన్నారు. కొణతాల రామకృష్ణను వైఎస్‌ కాలం నుంచి నమ్మకంగా ఉన్న అతనిని కాదని ఆయనకు శత్రువైన దాడి వీరభద్రరావును పార్టీలోకి ఎలా తీసుకుంటారని, అందుకే చివరికి ఇద్దరూ పార్టీలో లేరని గుర్తు చేసారు. జగన్‌ ప్రతిపక్ష పార్టీగా జన్మభూమి కమిటీలపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇలాంటి లోపాలు వైసీపీ లో చాలా ఉన్నాయని… ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచే సరికి జగన్, పార్టీ నేతల్లో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగిపోయిందన్నారు. సాధారణ ఎన్నికల్లో సర్వేలను నమ్ముకుని గెలిచేశాం అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండబట్టే పార్టీ ఓడిపోయిందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: