కింగ్ నాగార్జున మరియు జగన్ ఇద్దరు మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. అయితే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది నాగార్జున పావులు కదుపుతున్నాడని, అందరు భావిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా ఫీల్డుకు కు చెందిన కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లో చేరిపోయారు. ఇక అక్కినేని నాగార్జున సినిమాల్లో, బిజినెస్ లో కూడా చాలా ప్లాన్డ్ గా ఒక పద్దతిలో నడుచుకుంటూ ఉంటారు.

Image result for nagarjuna
అయితే ఇప్పుడు నాగార్జున రాజకీయాలలోకి కూడా ప్రవేశిస్తారని టాక్. వైఎస్ జగన్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పరంగా, బిజినెస్ పరంగా ఇద్దరికి సన్నిహిత సంబంధాలు బాగున్నాయి. గతంలో జగన్  జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్లి జగన్ ను పరామర్శించి వచ్చారు. అప్పట్లోనే ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పైగా ఇప్పటివరకూ స్నేహితుడిగా ఉన్న నాగార్జున, జగన్ లు అఖిల్  ప్రేమాయణంతో బంధువులు అయ్యారు. నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని ప్రేమించిన అమ్మాయి శ్రియా భూపాల్‌రెడ్డి స్వయానా జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలు.

Image result for nagarjuna
జీవికే రెడ్డి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి బాగా స‌న్నిహితులే కాక‌, బంధుత్వం కూడా ఉంది. ఆ బంధుత్వంతో నాగార్జున వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. 2014 నాగార్జున వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన అది ఎందుకో కార్య రూపం దాల్చలేదు. కానీ ఇన్నీరోజులు సైలెంట్ గా ఉన్న నాగార్జున వైసీపీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు ఫిల్మింనగర్ వార్తలు హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2109 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా గుంటూరు పార్లమెంట్ సీటు నుండి నాగార్జున ని పోటీ చెయ్యపించాలని జగన్ బావిస్తున్నాడని, అందుకు నాగార్జున సైతం సిద్దంగా ఉన్నాడని ఇన్నర్ టాక్


మరింత సమాచారం తెలుసుకోండి: