టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా.. అచి తూచి అడుగు వేస్తారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోకి ఎవరైనా ఓ సారి తొంగి చూస్తే.. ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పార్టీలోని ముఖ్య నాయకులంతా సైకిల్ దిగి... కారు ఎక్కేసి.. ఎవరికి వారు పదువులు పొంది పొందికగా గులాబీ గూటిలో కూర్చున్నారు. అయితే టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలతోపాటు క్యాడర్ మాత్రం పార్టీని వీడకుండా అలానే ఉండిపోయారు.
Image result for ttdp
పసుపు పార్టీ ఆయువు పట్టు అంతా ‘కేడర్’లోనే ఉందని గులాబీ నేతలకు తెలుసు. ఆ పార్టీ కేడర్‌ను గులాబీ పార్టీ నేతలు ఎన్ని రకాలుగా ఆశలు పెట్టినా... తాము మాత్రం సైకిల్ దిగే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు.  చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి... 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాగ్య నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఓ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. ఎందుకంటే.... తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Related image
అయితే ఏ పార్టీతో అనే విషయం మాత్రం చంద్రబాబు ఇక్కడ ప్రస్తావించలేదు. దీంతో పార్టీలోనివారంతా అయోమయంలో పడ్డారు. ఉంటే గింటే కారు పార్టీతోనే పొత్తు ఉండే అవకాశాలున్నాయని వారు కొత్త చర్చకు తెరలేపారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ టీడీపీ. మరోవైపు బీజేపీతో పలు సందర్భాల్లో టీడీపీకి పొత్తు కొనసాగుతూ వచ్చింది. అయితే విభజన నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా... ఇరు పార్టీల మధ్య కొంత దూరం పెరిగింది. అంతేకాక.. ఏపీ బీజేపీ నేతలే.. టీడీపీ నాయకులతో దూరం దూరం అంటున్నారు. దీన్ని చంద్రబాబే స్వయంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Image result for trs

ఈ నేపథ్యంలో గులాబీ పార్టీతోనే పొత్తు ఉంటుందేమో అనే సందేహం..తెలుగు తమ్ముళ్ల మెదళ్లని తొలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పార్టీని కిల్ చేసిన వారితో పొత్తు ఏమిటనే అలోచనలో టీడీపీ కేడర్ పడింది. అలాగే కారు పార్టీలో సైకిల్ పార్టీ విలీనం చేయాలంటూ సీనియర్ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి.  ఇలా చేస్తే ఆత్యహత్య చేసుకుంటామంటూ ఆర్మూరుకు చెందిన కార్యకర్త ఒకరు ప్రకటించారు. దీంతో అతడిని బాబు సముదాయించారు. 
Image result for motkupalli narasimhulu
ఇదిలావుంటే మోత్కుపల్లి తాజాగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవాంటూ సూచించారు. ఎందుకంటే.. టీఆర్ఎస్ అధ్యక్షుడి కేసీఆర్‌తోపాటు... ఆ పార్టీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న వారంతా... టీడీపీలోని మాజీ నేతలే అని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. మరి చంద్రబాబు టీఆర్ఎస్ నేతలతో పొత్తుకు సై అన్నా... ఆ పార్టీ నేతల నుంచి మాత్రం ఇంతదాకా ఎటువంటి స్పందనా లేదు. ఇదంతా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం చంద్రబాబుది వన్ సైడ్ లవ్ లాగా ఉంది పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: