ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గడచిన చాలా ఎన్నికలలో  కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాలలో ఒక్కటి  గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి  నియోజ‌క‌వ‌ర్గం. 1985 మినహా గడచిన మూడు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌లేదు.


అయితే  గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవి వైసీపీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాజ‌ధాని, ఏపీ అభివృద్ధి అంతా ఆధార‌ప‌డి ఉంది. చంద్ర‌బాబు ఈ సారి అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని విప‌క్షాల‌కు కేటాయించ‌కుండా ఇక్క‌డ నుంచి బ‌ల‌మైన టీడీపీ అభ్య‌ర్థిని రంగంలోకి దింపి ఇక్క‌డ పసుపు జెండా ఎగిరేలా చేయాల‌ని పార్టీ నాయ‌కులే కోరుతున్నారు.


అయితే ఈ క్రమంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల‌ను ఢీ కొట్టే రేంజ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు వేస్తుంది. ఆళ్ల‌ను ఓడించే బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గంతో పాటు ఆర్థికంగాను స్ట్రాంగ్‌గా ఉన్న వ్య‌క్తిని రంగంలోకి దింపితే అటు ఆళ్ల‌ను ఓడించ‌డంతో పాటు ఇటు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత మంగ‌ళ‌గిరిలో టీడీపీ జెండా ఎగిరిన‌ట్ల‌వుతుంద‌ని జిల్లా పార్టీ వ‌ర్గాలు కూడా భావిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా విడిచి పెట్టకూడదు అని భావిస్తున్నారు తెలుగుదేశం నాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: