ఏపీ బీజేపీ మంత్రులు పైడికొండల మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు గురువారం ఉదయం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ రాజీనామా పత్రాలను అందించారు. మాణిక్యాల రావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి మూడు నిమిషాల్లో బయటకు వచ్చారు. కామినేని శ్రీనివాస రావు మాత్రం రాజీనామా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చాంబర్‌లో కాసేపు ఉన్నారు. మంత్రులు మాణిక్యాల రావు, కామినేనిలు రాజీనామా చేసిన సమయంలో టీడీపీ మంత్రులు వారిని ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికారు.
 బీజేపీని, వెంకయ్యను దోషిగా చూపే ప్రయత్నం
ఇదిలా ఉంటే  కామినేని శ్రీనివాస రావు అసెంబ్లీలో ఎంతో ఎమోషనల్ గా స్పీచ్ కొనసాగించారు. ఆయన స్పీచ్ లో చంద్రబాబు, వెంకయ్య నాయుడిని చాలా గొప్పగా పొగిడారు. తన రాజకీయ ప్రస్థానానికి ఎన్టీఆర్ అండగా నిలిచారని..ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారని అన్నారు. 2014 లో మోడీ ప్రభుత్వం రాబోతుందని..బీజేపీలో చేరితే రాష్ట్రాభివృద్ది సాధించుకునే చాన్స్ ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనడంతో బీజేపీలో చేరానని..అందుకు తగ్గట్టుగానే సముచితమైన హోదా లభించిందని అన్నారు.
Image result for chandrababu venkaiah naidu
తనకు కేబినెట్‌లో అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ప్రతి ఒక్కిరికీ ఇబ్బందికరంగా ఉన్నాయని కామినేని తన లేఖలో పేర్కొన్నారు. మంత్రిగా నన్ను చేసినందుకు ఆనందంగా ఉన్నా..మరోవైపు ఒక బాధ ఉందని కొన్ని రాజకీయ కారణాలతో నాపై బుడుద చల్లడానికి ప్రయత్నాలు చేశారని.
Image result for వరసిద్ది వినాయక
నాపై అపవాదులు వేస్తున్నాయి కొన్ని పత్రికలు.  ‘‘ ఎక్కడైతే అసత్యం చెబితే..సర్వ నాశనం అయిపోతారో.. సత్య ప్రమాణాలకు అత్యున్నత స్థాయిగా  నిజ నిర్థారనకు అత్యున్న స్థానంగా పరిగణించే కానిపాకం వరసిద్ది వినాయకుడి సాక్షి’’గా నా రాజకీయ జీవింలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అనైతికంగా ఎవ్వరి దగ్గర డబ్బు తీసుకోలేదు. రేపే వెళ్లి ప్రమాణం చేయబోతున్నానని అన్నారు.  సహచర సభ్యులకు మీ అందరితో కలిసి పనిచేసిందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో అదే రకంగా ఉంటానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: