రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆంధ్రరాష్ట్రంలో భర్తీ అయ్యే ఆ మూడు సీట్ల పై చర్చ నడుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ మూడు సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహ రచనలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశంలో ఉన్న ఆశావహులకు ఊపిరిపోశాయి. అయితే తాజాగా రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించడంతో. తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో మూడు సీట్లు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ 2 సీట్లకే పరిమితం అయినట్లు తెలుస్తోంది.


ఎందుకంటే గతంలో బిజెపి పార్టీతో పొత్తు తో ఉన్న నేపథ్యంలో మూడవ సీటుపై కన్ను వేశారు చంద్రబాబు. పోటీలోకి అభ్యర్థి దింపాలని పన్నాగాలు ప్రణాళికలు వేశారు. అయితే ఈ క్రమంలో బిజెపి పార్టీతో పొత్తు తెగిపోవడం తమ సంఖ్యాబలం తగ్గిపోవడంతో చంద్రబాబు నాయుడు అటువంటి ఆలోచన నుండి విరమించుకున్నారు.


ఈ నేపథ్యంలో ఆంధ్రరాష్ట్రంలో భర్తీ అయ్యే ఆ మూడు సీట్లలో ఒక సీటు వైఎస్సార్ కాంగ్రెస్ కు  దక్కే అవకాశం ఉంది. ఆ స్థానానికి నెల్లూరుకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరును వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. మిగిలిన రెండు సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జనభర్జన పడుతోంది.


అయితే ఈ క్రమంలో రెండు సీట్లలో ఒక్క సీటు చంద్రబాబు సీఎం రమేష్ కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క రాజ్యసభ సీటు కోసం చాలా మంది తెలుగుదేశం పార్టీ ఆశావాహులు ఆతృతతో చంద్రబాబునాయుడు వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మూడవ రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. మొత్తంమీద ఈ మూడువ సీటు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని గండి కొట్టేటట్లు ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: