రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ మూడో అభ్యర్థిని పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాజ్యసభ నామినేషన్ వేయడానికి చివరిరోజు గనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం నాయకులతో చర్చలు జరిపారు.


ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు రాజ్యసభకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో సంఖ్యాబలాన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా….మూడవ స్థానం కైవసం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ‘టి.దేవేందర్‌గౌడ్‌’ ని  మరోసారి రాజ్యసభకు పంపించాలని పోటిలో నిలబెట్టలని చంద్రబాబు చూస్తున్నారు. ఒకప్పుడు ‘చంద్రబాబు’కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ‘దేవేందర్‌గౌడ్‌’ పార్టీలో నెంబర్‌ టూగా పేరుండేది.


గతంలో రాష్ట్ర రాజకీయాలలో ఎదురులేకుండా చక్రం తిప్పిన ఆయన…టిడిపిలో సీనియర్‌ లీడర్‌. ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన..’దేవేందర్‌గౌడ్‌’ ఎన్టీఆర్‌ మంత్రివర్గంలోనూ..తరువాత చంద్రబాబు మంత్రివర్గంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.


బిసి వర్గానికి చెందిన ‘దేవేందర్‌గౌడ్‌’ అప్పట్లో అసెంబ్లీలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని దులిపేశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యం కారణంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కానీ రాజకీయాలలో అంతగా కనిపించలేదు. ఈ క్రమంలో ఆయనను మరొకసారి రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: