ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..హాట్ టాపిక్ గా నిలిచే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఆసక్తికర విషయం వెల్లడించారు.  ఇప్పటి వరకు ప్రజలు జరిగిందంతా చూస్తున్నారని..ప్రజా  ప్రతినిధుల పనితీరు గమనిస్తున్నారని ప్రజాభిష్టాన్ని గమనించిన ప్రతినేత బీజేపీపై నమ్మకాన్ని పెంచుకుంటున్నారని అన్నారు. టీడీపీతో సహా పలు పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. వాళ్లంతా తమకు టచ్‌లో ఉన్నారని.. బీజేపీలో చేరేందుకు ఉత్సుకతతో ఉన్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. 
Image result for tdp
టీడీపీ చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేర ప్రత్యేక హోదా విషయం కేంద్రం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.  కాకపోతే అయితే బీజేపీ పెద్దలతో టచ్‌‌లో ఉన్నదెవరు? అనే విషయాన్ని మాత్రం చెప్పడానికి ఆయన సాహసించలేదు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు  కేంద్రం ఏమీ ఇవ్వలేదని పచ్చి అబద్దం..ఇప్పటి వరకు కేంద్రం ఎంతో ఆదుకుందని అన్నారు. కేంద్రం ఇంత చేస్తున్నప్పటికే కొందరు కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Image result for bjp
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని.. అసలైన వాస్తవాలన్నీ త్వరలోనే ప్రజలకు వివరిస్తామని చెప్పారు.  కాగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్ని్కల్లో బీజేపీ ఎవరికి మద్దతిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మద్దతు టీడీపీకా?.. లేక వైసీపీకా..? అనేదానిపై ఆదివారం సాయంత్రంలోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: