రాష్ట్రంలో ప్రత్యేకహోదా రగడ, రాజ్యసభ ఎన్నికలు వంటి ఎన్ని హాట్ టాపిక్ లు నడుస్తున్నా జగన్ ఆరంభించిన ప్రజాసంకలయాత్ర మాత్రం జోరుగానే  కొనసాగుతుంది. పాదయాత్ర చేస్తూనే రాష్ట్రంలో స్థితిగతులపై జగన్ ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని తెలుసుకుంటూ, యాత్రలో ఉంటూనే తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాడు. కడపజిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు మూడు నెలలపాటు పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.


కాగా ఆయన ప్రారంభించిన యాత్ర నేటితో110 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ముగిసిన యాత్ర ఇప్పుడు గుంటూరు జిల్లాకు చేరుకుంది. అయితే యాత్రలో బాబుపైన ఆసక్తికర వాఖ్యలు చేశాడు జగన్. సినిమారంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ బాబుకు దక్కకపోడవం బాధాకరమని ఆయన వ్యంగాస్త్రాలు విసిరాడు. బహుశా విదేశాల్లో ఉండే న్యాయ నిర్ణేతలకు చంద్రబాబు గురించి తెలియలేదేమో అని ఎద్దేవా చేశారు.


బాగా నటించిన నటులకు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డులు ఇస్తారు. ఇలా ప్రత్యేక హోదాపై ఎప్పటికప్పుడు మాటమారుస్తూ చంద్రబాబు చాలా అద్భుతంగా నటిస్తున్నారు. పార్టీకి చెందిన నాయకులతో రాజీనామానాలు చేయిస్తారు కానీ పొత్తును మాత్రం కొనసాగిస్తుంటారు. ఇంతకంటే మంచి నటుడు ఆస్కార్ వాళ్లకు ఎక్కడ దొరుకుతాడు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న నాటకాలు అమెరికాలో  ఉన్న వాళ్లకు బహుశా కనిపించలేదేమో అని ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: