ఆనాడు రాష్ట్రాన్ని  కాంగ్రెస్ విభజిస్తున్నప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా కల్పిస్తాం అని ప్రమాణం చేశారు. అప్పట్లో ప్రతిపక్షం గా ఉన్న బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి మరీ తాము అధికారంలో రాగానే ఏపీ కి హోదా ఇచ్చేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. విభజన చట్టంలో చెప్పినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదు సరిగదా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన తీరని అన్యాయం గురించి తెలిసిందే. 


ప్రస్తుతం రాష్ట్రంలో హోదా జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కేంద్రంలో టీడీపీ మంత్రులుగా ఉన్న సుజనా, అశోక్ గజపతులిద్దరూ రాజీనామా చేశారు. ఇక రాష్ట్ర కేబినెట్ లోని బీజేపీ మంత్రులు సైతం రాజినామా చేశారు. అయితే రాజీనామా చేసిన మంత్రుల్లో ఒకాయన బీజేపీ ని వీడబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు కామినేని శ్రీనివాస్. అందుకుతగ్గ కారణాలు లేకపోలేదు.


అసలే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని ఆంధ్రప్రజలు కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి టైములో ఓట్ల కోసం జనాల దగ్గరికి వెళ్ళి ఎలా అర్థించాలి. బీజేపీకి వచ్చే రెండు, మూడు సీట్లు కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్ కు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పట్టేలా ఉంది. బీజేపీని నమ్ముకుని ఎన్నికలలో అడుగుపెడితే ఎమ్మెల్యే పదవి కాదు సరిగదా డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకొని కామినేని పార్టీ వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీని వీడి పవన్ పార్టీ జనసేనలో అడుగుపెట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మాటల గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇన్ని మాటలు వస్తున్నా కామినేని స్పందించకపోవడం ఆ మాటలు నిజమేనన్న సందేహం కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: