రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీసుకున్నా నిర్ణయం తెలుగుదేశం పార్టీని కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో అగ్రవర్గాలకు చెందిన సీఎం రమేష్ కనకమేడల రవీంద్రకుమార్ కి కేటాయించారు చంద్రబాబు. ఈ క్రమంలో దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్యకి రాజ్యసభ సీటు ఇస్తారని చివరి వరకు ఆశ పుట్టించారు చంద్రబాబు.


తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో వర్ల రామయ్య ఎంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో రామయ్య తెలుగుదేశం పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున ప్రతిపక్ష నేత జగన్ మీద అనేక ఆరోపణలు చేసే వారు వర్ల రామయ్య. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికలలో వర్ల రామయ్య ని పక్కన పెట్టడం చూస్తుంటే మరోసారి చంద్రబాబు దళితుల మీద పక్షపాత ధోరణి ప్రదర్శించినట్లు తెలుస్తుంది.


గతంలో కూడా ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని  సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అయితే ఈ క్రమంలో ఎన్నికల ముందు చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల విషయంలో తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులకు చిరాకు పుట్టించింది.


అలాగే రాష్ట్రంలో ఉన్న దళిత బీసీ వర్గాలకు కూడా చంద్రబాబుపై అసహనం కలిగింది. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా దళిత బీసీ వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతాయి అని, ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీని ఓటమి దిశగా నడిపిస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: