తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి పార్టీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాష్ట్రంలో రోడ్లు కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే వేసారు అని గట్టిగా మాట్లాడటంతో…చంద్రబాబు అది వాళ్ల డబ్బేమీ కాదని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు.


ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తుంటే మీ జేబులో నుండి ఇచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదని బిజెపి నాయకులకు చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీరు చెప్పేది చూస్తుంటే రేపటి రోజున రోడ్లు వేసిన వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేలా ఉన్నారని అన్నారు. ట్రాఫిక్‌ను బట్టి రోడ్లు వస్తాయని.. అవి కూడా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రహదారులు నిర్మించారన్నారు.


అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గడ్కరీకి ఆ రోజే తాను చెప్పానన్నారు. రోడ్లు ఇవ్వకపోతే తానే నిర్మించుకుంటానని చెప్పిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నప్పుడు సహకరించాలి కానీ అడ్డుపడకూడదని రాష్ట్ర బిజెపి నేతలకు చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని అన్నారు.


ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపక్షనేత జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు రాజకీయ విశ్లేషకులు... నేను వేసిన రోడ్లపై నడుస్తూ నన్ను ప్రశ్నించడం ఏంటన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది  చంద్రబాబు వైఖరి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: