జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తప్పు చేశానని ఈ వేదికపై ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. అనుభవం ఉందని టిడిపికి మద్దతు ఇస్తే తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఇలా దోచుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు అని అన్నారు.


అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం అన్నయ్యను సీఎంగా చూడటం అని అంటున్నారు కొంతమంది. పొత్తులపై ఎలాంటి క్లారిటీ పవన్ కల్యాణ్ ఇచ్చే చాన్స్ లేదని జనసేవర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత ఎవరితో కలిసి నడుస్తారనేది రాజకీయవర్గాల్లో ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా పైనే తొలి సంతకం పెడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు.


అనూహ్యంగా పవన్ కల్యాణ్ ఈ ప్రకటనపై కొంత సానుకూలంగా స్పందించారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. చిరంజీవిని సీఎం కుర్చీలో చూడలనేది ఈ తమ్ముడి కోరికని చాలా సార్లు బహిరంగాగానే చెప్పారు కూడా. అదే సమయంలో వామపక్షాలు కాంగ్రెస్ కు దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయి. పైగా కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడుతున్నాయి.


ఈ క్రమంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడబలుక్కుని రాబోయే ఎన్నికలలో పోటీచేయాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు లెఫ్ట్ పార్టీలకు చెందిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని పలుమార్లు కలవడం జరిగింది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పవన్ కళ్యాణ్ దోస్తీ కట్టె అవకాశం ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: