ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కొత్త పదవులు కట్టబెట్టభోతున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఈ పదవులు కోసం ఎదురుచూస్తున్నా ఆశావహులు తమకు ఏ పదవి ఇస్తారో అని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.


కేవలం నామినేటడ్ పదవులు మాత్రమే కాకుండా మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఇద్దరు బిజెపి మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయటంతో పాటు, మంత్రివర్గంలో స్థానం లేని వర్గాలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు.


ఇప్పుడు మంత్రి పదవులు సక్రమంగా నిర్వహించని వారిలో కొంతమందిని తప్పించి ఆ స్థానాలని కొత్తవారికి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు భావిస్తున్నారని.. తెలిస్తోంది. అంతేకాకుండా వివాదాస్పదంగా మారిన టీటీడి బోర్డు, ఖాళీగా ఉన్న అనేక కార్పొరేషన్‌ ఛైర్మన్ ల, నియామకం కూడా ఈ పదవుల సమయంలోనే భర్తీ చేస్తారని తెలుస్తోంది.


అంతేకాకుండా అనేకచోట్ల పెండింగ్ లో ఉన్న మార్కెట్ యార్డులకి పాలకమండలి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరియు అదే విధంగా ఉగాది రోజున ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఓ కొత్త పథకాన్ని చంద్రబాబు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: