గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికలలో వైసీపీతో కలుస్తారని అంటున్నారు కొంతమంది. గుంటూరు వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేష్ చేస్తున్న అవినీతిని ప్రజల ముందు బయటపెట్టడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తల ఎత్తుకోలేకపోతున్నారు.


ఈ క్రమంలో టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ పై ఎదురుదాడికి దిగారు. పవన్ కళ్యాణ్ బిజెపి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జగన్ పార్టీతో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ వర ప్రసాద్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ మధ్య పవన్‌ ఫోన్‌ చేసి కలవాలని అడిగితే వెళ్లి కలిశానని, వైసీపీ తనపై ఎందుకు విమర్శలు చేస్తోందని అడిగారని ఆయన తెలిపారు.

అయితే… ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శిస్తున్నామని చెప్పానని వరప్రసాద్ తెలిపారు. టీడీపీతో లేను… అవసరమైతే జగన్‌కే మద్దతిస్తానని పవన్‌‌కల్యాణ్ నాతో చెప్పారని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతామని పవన్ కళ్యాణ్ అన్నారట.


ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ జగన్ కలిస్తే వార్ వన్ సైడ్ అయినట్టే అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు. అయితే ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో ఇప్పటికే విజయవకాశాలు వైసీపీ వైపు పుష్కలంగా కనబడుతున్నయి. ఈ నేపథ్యంలో పవన్ వైసీపీతో కలిస్తే మెజారిటీ వస్తుంది తప్ప పెద్దగా మార్పులు ఉండవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: