2014 ఎన్నికలలో చంద్రబాబునాయుడికి అనుభవం ఉందన్న నేపథ్యంలో మద్దతు ఇచ్చానని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే గుంటూరు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన పవన్ కళ్యాణ్ తర్వాత అనవసరంగా చంద్రబాబు కి మద్దతు తెలిపి తప్పు చేశానని బాధపడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అవినీతి ఆగడాలను ఎండబెట్టారు పవన్.


ఈ నేపథ్యంలో పవన్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కొందరు టిడిపి నాయకులు పవన్ మీద మాటల దాడి చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా.. పవన్ సిఫారసుతో రాష్ట్రప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైన మాజీ హీరోయిన్ పూనం కౌర్ ను ఆ పదవిని తొలగించాలని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


పూనం కౌర్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ రేంజి హీరోయన్ ను సమంతను నియమించుకుంటే.. దానికి పోటీనా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అప్పట్లో తమ ప్రభుత్వానికి ఫేడవుట్ అయిపోయిన ఒకనాటి హీరోయిన్ పూనం కౌర్ ను నియమించుకుంది.


కాగా, ఇప్పుడు ఆమెను చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవినుంచి తొలగించాలని బాబు సర్కారు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడంవల్ల పవన్ వల్లనే ఆమెకు పదవి వచ్చిందనే ప్రచారం ప్రజల్లో బాగా వెళ్తుంది అని ప్లాన్ లు వేశారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ పై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: