చంద్ర బాబు నాయుడు ఇప్పుడు ఏ నిర్ణయం కూడా క్లారిటీ గా తీసుకోలేని పరిస్థితి. ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వయసు పైబడటం వలన తన వ్యూహాలు పని చేయడం లేదని ఇప్పుడు అందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఒక పక్క వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అద్బుతంగా
ఉన్నాయని, అందరు అనుకుంటున్నారు.
Image result for jagan and chandrababu
బాబు కు కూడా వేరే గత్యంతరం లేక జగన్ ను ఫాలో అయిపోతున్నాడని అతను చెప్పిందే  చేస్తున్నాడని అందరు వ్యక్తపరుస్తున్నారు. మొదటగా  కేంద్రంనుంచి మంత్రుల్ని ఉపసంహరిస్తే తప్ప.. హోదాకోసం మోడీ సర్కారుపై ఒత్తిడి పెరగదు అని జగన్ కొన్నేళ్లుగా చెబుతోంటే దాన్ని కుట్రగా అభివర్ణించారు చంద్రబాబు. తీరా ఇప్పుడు అదే పనిచేసే అక్కడికేదో తాము వీర పోరాటం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. తమ అవిశ్వాసానికి మద్దతివ్వమని జగన్ అడిగితే.. చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Image result for jagan and chandrababu
మీరు అవిశ్వాసం పెట్టండి మేం మద్దతిస్తాం.. అని జగన్ అంటే ఛీ కొట్టారు. తీరా.. జగన్ అడిగినట్టే ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని కూడా జగన్ సహా ఇతర విపక్షాలు కూడా పలుమార్లు కోరాయి. అయితే చంద్రబాబు ససేమిరా అన్నారు. అయితే త్వరలోనే అఖిలపక్షం ఏర్పాటుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన అనుభవం ముసలది కావడం తో జగన్ లాంటి యువకుడి ఆలోచనలను పాటిస్తున్నాడని, ప్రజలు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: