సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ప్రజలలో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. తన అన్న చిరంజీవి లాగే సినిమాలలో నెంబర్ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ స్థాపించాడు. ప్రస్తుతం నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. అప్పట్లో పవన్ పై కత్తి మహేష్ చేసిన రచ్చ తెలిసిందే. పవణ్ ఫ్యాన్స్ కు మరియు కత్తికి మధ్య కొన్ని నెలలు వివాదం జరిగి జనవరిలో ముగిసింది.


ఇంక ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించను అని చెప్పి ఇప్పటికీ ట్విట్టర్లో పవన్ పై దుమ్మెత్తిపోస్తుంటాడు. అయితే ఒక విషయంలో మాత్రం పవన్ కు తన మద్దతు కల్పించి అందరినీ షాక్ కు గురిచేశాడు. అదెలాగంటే జనసేన పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్లు నిండాయి. ఇందుమూలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్న గుంటూరు లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


ఆ సభలో జగన్, చంద్రబాబులను తీవ్రంగా విమర్శించాడు. వచ్చే ఎన్నికలలో జనసేనకు ఓటువేసి రాష్ట్రాన్ని మార్చుకుందాం అని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. అయితే ప్రత్యేకహోదా గురించి మాట్లడుతూ అవసరం అనుకుంటే హోదాకోసం నిరాహారదీక్షకైనా పూనుకుంటానని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పవన్ అన్నమాటలకు కత్తి ట్విట్టర్లో స్పందించాడు. "ప్రత్యేకహోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే, నేను కూడా చేస్తా. ప్రత్యేకహోదా! ఆంధ్రుల హక్కు!!" అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. కాగా హోదాకోసం పలురాజకీయ నేతలతో కలిసి కత్తి ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: