ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం అని ముందు నుంచి రాష్ట్రంలో బాగా నమ్ముతున్నా రాజకీయనాయకుడు ప్రతిపక్ష నేత జగన్. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా రావలసిన ప్రత్యేక హోదా హామీని పక్కన పెట్టేసింది. ఈ సందర్భంగా కేంద్రాన్ని నిలదీయాల్సిన అధికార పార్టీ అధినేత చంద్రబాబు కూడా కేంద్రంతో కుమ్మక్కయి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం చేసి మాట్లాడారు.


అయితే ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి దాని ప్రాముఖ్యతను చాటి చెప్పడంలో సఫలీకృతం అవడంతో అధికారపార్టీ తెలుగుదేశానికి కంగారు పుట్టుకొచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పార్లమెంట్ సాక్షిగా జగన్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంతో పోరాడడానికి రెడీ అయ్యారు.


రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేయడంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు జగన్. ఈ నేపథ్యంలో కేంద్రం పై వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఏపీ ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశారు. 4ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న రాజీ లేని పోరాటంతో తెలుగుదేశం పార్టీతో సహా జాతి మొత్తం మేల్కొందని జగన్ ట్వీట్ చేశారు.


రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ మరోసారి వైఎస్సార్‌సీపీ బాటలో నడిచి… కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందని జగన్ ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, ఏపీ ప్రజలు సాధించిన విజయంగా జగన్ అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఏపీ ప్రజల హక్కుల సాధనకై కృషి చేస్తుందని జగన్ ట్వీట్ చేశారు. ఏది ఏమయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి వైసీపీ చేస్తున్న పోరాటానికి టిడిపి మద్దతు తెలపడం విశేషం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: