జనసేన పార్టీ ఆవిర్భవించి అప్పుడే నాలుగేళ్లు నిండాయి. ఇందుమూలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండురోజుల క్రితం గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ ఎదుట ప్రాంగణంలోఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ సభలో ఆంధ్ర రాజకీయనాయకులందరినీ కడిగేశాడు పవన్. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లపై నిప్పులు చెరిగాడు.


మీ అబ్బాయి లోకేష్ చేస్తున్న అవినీతి వ్యవహారాలు మీ దృష్టికి వచ్చాయా? అసలు అవేంటో మీకు తెలుసా? అంటూ చంద్రబాబును ప్రశ్నించాడు. మహనీయుడు ఎన్టీఆర్ మనవడిగా ఉండి మీరు చేస్తున్న పని ఇదేనా అంటూ మంత్రి లోకేష్ కు గట్టిగానే కౌంటర్ వేశాడు. దీనికి సంబంధించి సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే కాస్త ఘాటుగానే స్పందించాడు. గత నెల చివర్లో అసలు పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియదన్న ఆయన ఇప్పుడు మరో సంచలన వాఖ్యలు చేశాడు.


ప్రస్తుతం బాలయ్య తన నియోజకవర్గమయిన హిందూపురంలో పర్యటిస్తున్నాడు. కొన్ని అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించాడు. మొన్న పవన్ చెప్పిన మాటలకి మీరేమి సమాధానం ఇస్తారని జర్నలిస్టులు ఆయనని అడగ్గా- ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు. మేమే సూపర్‌స్టార్లం అని సమాధానమిచ్చాడు. పవన్ అంత సీరియస్ గా స్పీచ్ ఇచ్చి విమర్శించగా అసలు పవన్ మాకు  పోటీనే కాదు అన్నట్లుగా బాలయ్య అతన్ని తీసిపారేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: