విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలిసిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మొండిచేయి చూపించడంతో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. ఈ క్రమంలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.


ఈ క్రమంలో పక్క రాష్ట్రం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న మోసంని గుర్తించి. తెలుగుదేశం పార్టీ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని అధికార ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని ఎఐఎడిఎంకె నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ విజ్ఞప్తి కోరారు.


ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రానికి కీలకమైన కావేరీ జలాల విషయంలో ఇరు పార్టీలు ఒకే తాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్న కేంద్రంకి ధీటుగా దక్షిణాది రాజకీయ పార్టీలు అన్నీ ఒకే తాటిపై వచ్చి నిలబడాలని అనుకుంటున్నారు దక్షిణాది రాజకీయ నాయకులు.


ఇదిలా ఉండగా టిడిపి ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అవిశ్వాస తీర్మానానికి ఏ ఏ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయో అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాలలో చర్చనీయాంశమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: