జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రంలో అనేక సభలు ఉపన్యాసాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పార్టీ కార్యకలాపాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చేశాడు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.


 కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో మొన్న మొన్నటి వరకూ అవిశ్వాసం పెట్టండి దేశం మొత్తం తిరిగి అవసరైమైన మేరకు ఎంపీల యొక్క మద్దతు కూడగడతా అంటూ అప్పట్లో ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే ..అయితే ఆ మధ్య జగన్ అవిశ్వాసం పేరు చెప్పినా ఆ తరవాత చంద్రబాబు అవిశ్వాసం అనే మాట అన్నా .. పవన్ కళ్యాణ్ వెంటనే మద్దతు ఇస్తా అనీ దమ్ముంటే మోడీ కి వ్యతిరేకంగా పెట్టాలి అంటూ సవాల్ విసిరారు.


తీరా మొన్న రెండు రోజుల క్రితం జగన్ అవిశ్వాసం పెట్టిన తరవాత మాత్రం నోరు మెదపని కళ్యాణ్ ఇప్పుడు బాబు అవిశ్వాసం పెట్టిన నోరు మెదపటం లేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సెలైంట్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.


పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ పార్టీ ఉన్నట్లు ఉంది అని రాష్ట్రంలో కొంతమంది అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్కటైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నోరు మెదపకుండా ఉండటం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నేతలకు అనుమానాలు కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: