పెత్యేక హోదా విషయం లో జగన్ మోహన్ రెడ్డి ఎంపి లా రాజీనామాలను ప్రకటించాడు. ఒక అడుగు ముందుకు వేసి కేంద్రం మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్ట దానికి కూడా సిద్దం అయిపోయాడు. ఇప్పుడు అదే విషయం లో వైసిపి ముందుకు కూడా పోయింది అయితే టీడిపి అసలు మొదట్లో అవిశ్వాస తీర్మానం ఎందుకు అని మాట్లాడినాడు. తొలినుంచి అవిశ్వాసం ప్రతిపాదించడం గురించి.. చాలా గట్టిగా పట్టుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికీ అదే ధోరణిని కనబరుస్తూ ఉండగా.. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ.. అంత ప్లెయిన్ గా.. ఏ సంగతీ ఇప్పటికీ చెప్పలేకపోతుండడం విశేషం.
Image result for jagan and babu
అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాము ప్రతిపాదించే తీర్మానానికి తెలుగుదేశం పార్టీ అయినా మద్దతివ్వాలని కోరుతూనే.. ఒకవేళ తెలుగుదేశం తీర్మానం ప్రతిపాదించినా తాము మద్దతిస్తాం అంటూ.. జగన్ చాలా ప్లెయిన్  గా ప్రకటించారు. అయితే తొలుత తాము మద్దతిస్తాం అని ప్రకటించిన చంద్రబాబు, ఆ తర్వాత మడత పేచీ పెట్టారు. తీర్మానం తామే పెడతాం అని ప్రకటించారు. ఏదైతే ఏమైంది. వైకాపా వారికి కూడా మద్దతుగా నే నిలిచింది.
Image result for jagan and babu
తమ రెండు పార్టీల తీర్మానాల్లో తెదేపా తీర్మానాన్ని స్పీకరు చర్చకు స్వీకరించినా కూడా.. తాము మాత్రం స్పష్టంగా మద్దతు ఇస్తాం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. వారు చెప్పినంత ప్లెయిన్  గా స్పష్టంగా తెలుగుదేశం చెప్పలేకపోతున్నది. అవిశ్వాసం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తమ రాజకీయ మైలేజీ చూసుకోకుండా.. తీర్మానం చర్చకు వస్తే చాలుననే ధోరణిని ప్రదర్శిస్తోంది. అదే సమయంలో..  తెదేపా.. వైకాపా వారి తీర్మానం చర్చకు వచ్చినా తాము మద్దతివ్వడానికి రెడీ అనే మాట తెలుగుదేశం నోటినుంచి రాలేకపోతున్నదని పలువురు అంటున్నారు. వారు విపక్షాల పోరాటానికి కూడా అంత స్వచ్ఛంగా  సహకరించేట్లయితే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేసి ఉండేదని వాదన కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: