రాజకీయాలంటే ఇవేనేమో! గత 5 రోజులుగా ఏపీలో నడిచిన రాజకీయ నాటకాలు దేశంలో మరెక్కడా జరగలేదంటే అది అతిశయోక్తి కాదు. ఎన్డీయే లొనే కొనసాగుతూ టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం, రెండు రోజుల తరువాత ఎన్డీయే నుండి టీడీపీ బయటకి రావటం అసలు బాబు వ్యూహమేంటో ఎవరికి అర్థం కాలేదు. అవిశ్వాసంపెట్టడం వల్ల ఏమి ఒరగదు అది సమయం వృథా పనులు అని అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చిన బాబు ప్రతిపక్ష జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత తాను కూడా పెట్టి సవాల్ విసిరాడు.


ఇక బీజేపీ తామూ తక్కువ తినలేదన్నట్లుగా అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో ఏపీ నేతలతో సమావేశమయి ఏపీ బీజేపీ లో స్వల్ప  మార్పులను చేపట్టింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్న సిద్ధార్థ్ సింగ్ స్థానంలో రామ్ మాధవ్ ను పార్టీ అధిష్ఠానం నియమించింది. పదవీ భాద్యతలు చేపట్టిన రోజే రామ్ మాధవ్, బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.


పొలిటికల్ గేమ్ లు ఆడటంలో చంద్రబాబును మించిన వారు ఒక్కరు కూడా లేరని ఆయన సంచలన వాఖ్యలు చేశారు. రాజకీయ జిమ్మిక్కులకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ ఎద్దేవా చేశారు. అంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాము మొదటి నుంచి బాబు వెంటే ఉన్నామన్నారు. అవిశ్వాస తీర్మానంపై తమకు ఎలాంటి భయం లేదని ఆయన చెప్పారు. తమకు సరిపడా బలం ఉందని చెప్పారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు, మోడీ సర్కార్‌ పై బురదజల్లుతున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: