ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల మీద కొంచెం అయిన అవగాహన ఉన్న వారికి మాత్రం ఒక విషయం అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న అన్ని వ్యూహాలను టీడిపి ఫాలో అవుతుంది. బిజెపి నుంచి టీడిపి బయటికి రావడం జగన్ పన్నిన వ్యూహాల వల్ల అని చెప్పవచ్చు. ఇక అవిశ్వాసం అని జగన్ అంటే.. చంద్రబాబు రెచ్చిపోయాడు. అది కూడా పక్షం రోజుల కిందట.. " ఏం.. అవిశ్వాసం పెడితే ఏమవుతుంది?"

Image result for jagan and chandra babu

"మేమేం చేయాలో మీరు చెబుతారా" "మీ అనుభవం ఎంత?" అంటూ ప్రశ్నలేశాడు చంద్రన్న. కట్ చేస్తే.. ఇప్పుడు అవివ్వాసం అవిశ్వాసం అంటూ తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. ఇక తర్వాతి స్టెప్ కు ఇప్పటికే వైకాపా రాజీనామాల అస్త్రాన్ని సంధించింది. ఇప్పటికే వైకాపా అధినేత తమ ఎంపీల రాజీనామా అంశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామాల అంశాన్ని తెలుగుదేశం ఎంతగా ఎద్దేవా చేసిందో అందరికీ తెలిసిందే.
Image result for jagan and chandra babu
అయితే.. ఇప్పుడు తెలుగుదేశం తర్వాతి స్టెప్ లో ఎంపీల రాజీనామా కూడా ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాలు ముగుస్తున్న సమయంలో వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. ఇక తెలుగుదేశం కూడా వైకాపా వాళ్లను అనుసరించక తప్పదు. అనుసరించబోతోంది.. అనేది కూడా వాస్తవం. వైకాపా వాళ్లకు రాజీనామాల క్రెడిట్ ఎక్కడ వస్తుందో.. అనే భయంతో అయినా.. తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు ఇస్తారు. మరోసారి.. తెలుగుదేశం పార్టీ దేక్కొంటూ జగన్ ను అనుసరించనుంది!! ఔరారా.. 40యేళ్ల చంద్రబాబు అనుభవం 40యేళ్ల జగన్ ను అనుసరించడానికి మించి ఎందుకూ పనికి 
రాకుండా పోతోందే!


మరింత సమాచారం తెలుసుకోండి: