కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏవిధంగా మోసం చేసిందో వివరించే ప్రయత్నం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని ప్రత్యేక హోదా నుండి పోలవరం వరకు ఆనాటి యుపిఏ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలలో ప్రస్తుత ఎన్డియే కేంద్ర ప్రభుత్వం ఏవేవి అమలు చేసిందో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు.


ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం విభజన సమయంలో చెప్పింది...అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా అడిగితే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వవద్దని పార్లమెంటులో హోంశాఖ సహాయమంత్రి చెప్పారని పేర్కొన్నారు. అలాగే రెవిన్యూ లోటు విషయంలో కేంద్రం మాట మార్చడం కూడా  వివరించారు.


అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఇబ్బందులు పెట్టినా కూడా చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలిపి విసాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని నాడు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని అన్నారు నాడు విభజన సమయంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని కేశినేని నాని పేర్కొన్నారు.


అలాగే ఢిల్లీని తలదన్నేలా ఆనాడు రాజధాని నిర్మిస్తానని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ హామీ ఇవ్వడం జరిగింది….అయితే అధికారంలోకి వచ్చాక  రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది అని అన్నారు. ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు కేశినేని నాని. ఈ క్రమంలో కేశినేని నాని కేంద్రం ఎ ఒక్క విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదు అన్న విధంగా కేశినేని నాని తాను చెప్పదలుచుకున్నది చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: