రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి ఇప్పటిదాకా సరిగ్గా సమావేశాలు జరగకపోవడంతో దేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫ్లోర్ లీడర్ల సమావేశంలో పార్లమెంటు జరుగుతున్న తీరును తప్పుబట్టారు….ఇలా సమావేశాలు జరుగుతూ పోతే దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని...దేశాభివృద్ధి వెనకబడి పోతుందని అన్నారు.


12 రోజులలో ఒక్క రోజు కూడా సభా కార్యక్రమాలు సవ్యంగా జరగకపోవడంతో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెద్దల సభలోని ఎంపీల కోసం రేపు ఆయన ఏర్పాటు చేసిన విందును రద్దు చేశారు. ఈ డిన్నర్ కోసం గత వారంలోనే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. విందు గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా అధికార, విపక్షాలకు చెందిన నాయకులు, పలువురు ఫ్లోర్ లీడర్లకు వెంకయ్యనాయుడు ఇప్పటికే చెప్పేశారు. ఆహ్వాన పత్రాలు కూడా సిద్ధం చేశారు.


అయితే కనీసం ఆహ్వానాలు పంపేందుకు ఒక్కరోజు ముందైనా రాజ్యసభ సాధారణ స్థితికి వస్తుందని వెంకయ్యనాయుడు ఆశించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడో వారంలోకి కూడా అడుగుపెట్టడంతో సోమవారం నాటికైనా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన భావించినప్పటికీ అలా జరగలేదు.


దీంతో వెంకయ్యనాయుడు ఈ విందును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సరిగ్గా జరగనప్పుడు మన విందులు చేసుకోవటం మంచిది కాదని అన్నారు. దీంతో ఈ ఇందుకోసం చేసిన ఏర్పాట్లను పక్కన పెట్టేశారు పార్లమెంట్ సిబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి: