రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. నెలముందు వరకు చంద్రబాబు రాబోవు ఎన్నికలలో ఫేవరెట్ గా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బీజేపీ తో మిత్రపక్షముగా కొనసాగినప్పటికీ  కేంద్రం తరఫున టీడీపీ రాష్ట్రానికి ఏ మేలు కూడా చేయలేకపోయిందన్న వాదనతో ప్రజలు టీడీపీ కి వ్యతిరేఖమవుతూ వైసీపీకి దగ్గరవుతున్నారు. ఒక వేళ ఇదే వ్యతిరేఖ భావం ఎలక్షన్ల వరకు కొనసాగితే జగన్ సీఎం కావడం స్పష్టంగా తెలుస్తుంది. 


అయితే జగన్ సీఎం అయితే మాత్రం చంద్రబాబు, లోకేష్ లు జైలుపాలవడం ఖాయమని తెలుస్తుంది. అదెలాగంటే నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సభలో లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని, ఐటీ దాడుల్లో దొరికిపోయిన శేఖర్‌రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. లోకేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో బయటపెడతానని తెలిపాడు.

ఇదిలాగుంటే జగన్ ను మాత్రం కొద్దిగానే విమర్శించడం అనుమానాలకు దారితీస్తుంది. బాబుపై అసహనంతో ఉండడంతో జగన్ కు సానుకూలం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమయితే  జగన్ సీఎం అయితే పవన్ నుండి లోకేష్ అవినీతి ఆధారాలు సేకరించి జైలుకు పంపించే సూచనలు కనిపిస్తున్నాయి.


బాబుని కూడా జగన్ జైలుకు పంపేస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 5 కోట్లు ఒప్పందం చేసుకున్న టిడిపి అడ్వాన్స్ గా రూ. 50 లక్షలు ముట్టచెప్తుండగా రేవంత్ రెడ్డి ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో ఈ వ్యవహారం నడిపింది బాబేనని ఆడియో టేపులను కూడా బయటపెట్టారు. జగన్ సీఎం అయిన తరువాత ఈ కేసుని కూడా డొంక కదిలించి బాబు భరతం పడతాడని రాజకీయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: