ఈ రోజు దేశవ్యాప్తంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 25 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 10 రాష్ట్రాల్లోని 58 సీట్లకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో నాలుగు రాష్ట్రాలలోని 33  పెద్దల సీట్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన ఆరు రాష్ట్రాలకు సంబంధించిన 25 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్ లలో ఈ ఎన్నికలు జరిగాయి.


తెలంగాణా రాష్ట్రంకు సంబంధించి మూడు రాజ్యసభ సీట్లకు శాసనసభలోని కమిటీ హాల్‌లో ఈరోజు ఉదయం 9 గంటలకు పోలింగ్‌ మొదలైంది. మూడు రాజ్యసభ సీట్లకు  నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్‌ లు బరిలో దిగగా , కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

కాగా తెలంగాణా రాజ్యసభ ఎన్నికలలో నాటకీయపరిణామాలు  చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు దూరం అవగా, కాంగ్రెస్ అయితే ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఈ మేరకు రాజ్యసభ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు తెరాస శ్రేణులు కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ అభ్యర్థి గెలవడని తెలిసినా స్థానాలను ఏకగ్రీవం కాకుండా చేసి విలువైన సమయాన్ని , డబ్బును వృధా చేస్తుందని ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: