రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ నగరమైన పశ్చిమ సైబీరియాలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 37మంది వరకు ప్రాణాలు కోల్పోయారని రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రకటించింది. కెమెరోవో పట్టణంలోని వింటర్ చెర్రీ మాల్‌ ఆదివారం జనం హాహాకారాలతో దద్దరిల్లింది.
37 dead in Siberia shopping mall fire
అగ్ని జ్వాలలు దారుణంగా వెంటాడి 37 మంది ప్రాణాలను కబళించాయి. అగ్ని కీలల ధాటికి 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. 69 మంది అదృశ్యమయ్యారు, వీరిలో సుమారు 40 మంది చిన్నారులు ఉన్నారు. నాలుగు అంతస్థులు ఉన్న ఈ షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. మల్టీప్లెక్స్ లోని రెండు థియేటర్లలో పైకప్పు కూలిపోయిందని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది.
 37 dead in Siberia shopping mall fire - Sakshi
సైబీరియాలోని ప్రధాన షాపింగ్ సెంటర్ కావడం.. అది కూడా ఆదివారం కావడంతో.. ఎక్కువమంది ఆరోజు మాల్‌కు వచ్చినట్టు చెబుతున్నారు. కొంతమంది అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్‌ మాల్‌ కిటీకీల నుంచి దూకడంతో చనిపోయినట్లు తెలిసింది. ఈ నగరం రాజధాని మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో ఉంది.  అయితే ప్రమాద సమయంలో ఎంతమంది ఆ మాల్ లో ఉన్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: