పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీక్ కేసులో.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్‌.. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా.. జీవితకాలం నిషేధం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, వన్‌ ఎఫ్‌  ప్రకారం.. జీవితకాలం పాటూ నిషేధిస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది.  ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ విధంగా మాజీ ప్రధాని షరీఫ్ పై నిషేధం విధించడం సరైనదేనని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.   అయితే ఎన్ని రోజులు ఆయనపై అనర్హత కొనసాగుతుందనేది మాత్రం సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు.
Image result for nawaz sharif
దీనిప్రకారం భవిష్యత్తులో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. షరీఫ్‌తోపాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్‌ ప్రధాన కార్యదర్శి జహంగీర్‌ తరీన్‌పై కూడా జీవితకాల నిషేధం విధించారు. చీఫ్‌ జస్టిస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. 2013లో జరిగిన ఎన్నికల్లో నామపత్రాలు దాఖలు చేసినప్పుడు ఆయన యూఏఈలో తన కుమారుడికి ఉన్న కంపెనీల నుంచి తీసుకున్న జీతాలను పేర్కొనలేదని కోర్టు తప్పుపట్టింది. ఇది ఆయన ఆస్తేనని గుర్తించింది.
Image result for nawaz sharif
ఈ కారణంగానే ఆయనను అనర్హునిగా ప్రకటించింది. పార్టీ చీఫ్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కొట్టివేసింది. కాగా, మూడు సార్లు పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ తన ఆస్తులు ప్రకటించడంలో విఫలం కావడంతో.. పాక్ సుప్రీం గతేడాది ఆయనను ప్రధాని పదవిలో నుంచి తొలగించింది. చీఫ్‌ జస్టిస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించడం చర్చనీయాంశం అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: