రాజకీయ ప్రయోజనాలను జాతి ప్రయోజనాలతో ముడిపెడితే అది దేశాభివృద్ధికే చేటు తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోందని తెలుగుదేశం పదేపదే చేస్తున్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. కాకినాడకు రావాల్సిన భారీ రిఫైనరీ కేంద్రం తీరుతో వెనక్కిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కు దక్కకుండా కేంద్రం కుట్ర చేసిందని మరో ఆరోపణ టీడీపీ చేస్తోంది. అంతేకాదు.. కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతోందని సాక్షాత్తు చంద్రబాబే చెబుతున్నారంటే పరిస్థితి  ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు..

Image result for modi and tdp

          చెన్నైలో పర్యటించిన మోదీ.. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని స్పష్టం చేశారు. అయితే.. సమాఖ్యస్ఫూర్తిని కేంద్రం కొనసాగిస్తోందని చెప్తున్న మోదీ.. దాని ఆచరణలో మాత్రం చూపించట్లేదని అర్థమవుతోంది. దేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాలరాసేలా కేంద్రం  వ్యవహరిస్తున్న తీరుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఈ కోణంలోనే తాజాగా కేంద్రం వక్రబుధ్ది మరోసారి అర్ధమైంది. ఓవైపు సమాఖ్య స్ఫూర్తి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే  ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ లాంటి నాలుగేళ్ల బిడ్డపై ఏస్థాయిలో విషం కక్కుతున్నారో తాజా పరిణామాలు మరోసారి నిజం చేశాయి.. ఇప్పటికే హోదా ఇవ్వకుండా దగా చేసిన మోదీ సర్కారు.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై ఉక్కుపాదం మోపుతోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ఏపీకి రావాల్సిన విదేశీ పెట్టుబడులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లించేస్తున్నారు. విభజనతో కుంటుబడిన రాష్ట్రం నోటి దగ్గర ముద్దను లాగేస్తూ అడ్డగోలుగా ధగా చేస్తోంది మోదీ సర్కారు..  

Image result for aranko petroleum refinery

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా కు చెందిన అరాంకో సంస్థ ముందుకొచ్చింది. కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తాం.. కానీ మార్కెటింగ్ మీరే చూసుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం లిమిటెడ్‌ వంటి సంస్థలు భాగస్వాములైతే.. పెట్టుబడులు పెడతామంటూ కేంద్రంతోనూ, రాష్ట్రంతోనూ సౌదీ అరాంకో సంప్రదింపులు జరిపింది. ఈ రిఫైనరీ వస్తే.. కాకినాడలో ప్రత్యక్షంగా 33వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వచ్చేవి కానీ.. కానీ దీనికి కేంద్రం ప్రభుత్వం రత్నగిరి రిఫైనరీ తో చెక్ పెట్టింది..

Image result for amit shah

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన అరాంకో సంస్థతో గుట్టుచప్పుడు కాకుండా సంప్రదింపులు జరిపారు కేంద్రం మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, నితిన్‌గడ్కరీ. ఏపీకి రావాల్సిన అరాంకో సంస్థను రత్నగిరిలో ఏర్పాటు చేసేలా అడుగులు వేశారు. భారత్ కు చెందిన మూడు చమురు సంస్థలు రత్నగిరికి వెళ్లిపోవడంతో కాకినాడలో భారీ పెట్టుబడులు పెట్టే స్థితిలో ఆ సంస్థలు లేవు. కేవలం  బీజేపీ కుట్ర వల్లే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు మహారాష్ట్రకు వెళ్లిపోయాయని పారిశ్రామిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Image result for chandrababu

కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రం మరిన్ని కుట్రలు చేసే అవకాశం ఉందని స్వయంగా చంద్రబాబే ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కేంద్రాన్ని ఢీకొట్టేందుకు, కుట్రలను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు చంద్రబాబు. టీడీపీని కావాలని ఢీకొంటే బీజేపీకే ఎక్కువ నష్టం అంటూ హెచ్చరించారు. దేశంలో దక్షిణాది వాదం బలపడుతున్న తరుణంలో కేంద్రం తనవైఖరిని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచే అవకాశం లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: