ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు రాష్ట్రమంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై తన ట్విటర్ ద్వారా సెటైర్లు వేశారు. గత కొంత కాలంగా ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు మాత్రమే స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ స్పందించడంతో ఈ విషయం పెద్ద సంచలనం అయ్యింది. గత కొంతకాలంగా నారా లోకేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
Image result for లోకేష్
ఈ నేపథ్యంలో ఇటీవల దేశంలో నగదు కొరత ఏర్పడడంతో బిజెపి నాయకులపై మండిపడ్డారు లోకేష్. కరెన్సీ కష్టాలపై జైట్లీ చేసిన ట్వీట్లకు కూడా మంత్రి లోకేష్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే దేశంలో కావలసిన దానికంటే ఎక్కువగానే నగదు ఉందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌పై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.
Image result for lokesh modi
ఆ సందర్భంలోనే లోకేష్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఏపీకి చేసిన మోసంపై మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే నారా లోకేష్ చేసిన విమర్శలకు ప్రధాని కార్యాలయం స్పందించింది. సరైన పరిశోధన ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం బాధాకరమంటూ నరేంద్ర మోదీ తరపున ట్వీట్ వచ్చింది.
Image result for lokesh modi
దీంతో లోకేష్ చాలా తీవ్రంగా స్పందించారు ఏపీకి ప్రత్యేక హోదా సహా చట్టంలో పొందుపర్చిన విధంగా ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని తాము ప్రశ్నించామని, బీజేపీ నేతలే ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై బురద చల్లుతున్నారని మోడీకి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఢిల్లీలో ఉన్న బిజెపి నాయకులు ఏం మాట్లాడలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: