ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన దీక్షకు చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులు ఉబ్బిలో పడి ఉంటే..చంద్రబాబు ఖర్చుతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంతో మరింత అప్పుల్లో కి రాష్ట్రం కూలిపోయింది. తాజాగా రాష్ట్రానికి మోసం చేశారు కేంద్రం అంటూ ప్రత్యేక హోదా విషయం గురించి చంద్రబాబు చేపడుతున్న ‘ధర్మ పోరాట దీక్ష’ కు ఆంధ్రప్రదేశ్ ఖజానా చమురు వదిల్చేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
Related image
విభజన చట్టంలోని ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపడుతున్న ఈ ఒక్కరోజు దీక్షకు దాదాపు 20 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి జనసమీకరణ కొరకు డ్వాక్రా మహిళలను.. కళాశాల విద్యార్థులను అలాగే పాఠశాల విద్యార్థులను దీక్షా ప్రాంగణం స్థలం దగ్గరికి తీసుకు రావడానికి కొన్ని వందల ఆర్టీసీ బస్సులు.. అలాగే ప్రైవేటు బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Image result for chandrababu
దీంతో ఇంత హడావిడి చేస్తున్న ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పలువురు రాజకీయనాయకులు మండిపడుతున్నారు...అలాగే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడంపై ప్రభుత్వ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ‘ధర్మ పోరాట దీక్ష’ ఏర్పాట్లను కళావెంకట్రావు నేతృత్వంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా సభ స్థలంలో ఎల్ ఈడీ స్క్రిన్ల ఏర్పాట్లను కూడా చేశారు.
Related image
అయితే ఈ నేపథ్యంలో వైసిపి పార్టీలు మాత్రం పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామా చేయకుండా...అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఢిల్లీలో కేంద్రానికి సహకరించిన చంద్రబాబు...రాష్ట్రంలో తన పుట్టినరోజు నాడు ఇలా నటిస్తూ దీక్ష చేయడం సిగ్గుచేటు అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: