ప్రొద్దున లేవడం మొదలు రాత్రి పడుకునే ముందు వరకు ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు రాజకీయనాయకులు. అయితే ఇవన్నీ వ్యక్తిగతంగా కాదు రాజకీయ ప్రయోజనం కోసమే అని చాలా మందికి తెలియదు. ఒకరికొకరు వ్యక్తిగతంగా ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ సంఘటనలని మనం చాలా సార్లు చూసాం కూడా.


నేడు ఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నేటితో ఆయన 67 సంవత్సరాలు పూర్తిచేసుకొని 68 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. కాగా జగన్ యెక్క పుట్టినరోజునాడు చంద్రబాబు ట్విట్టర్లో శుభకాంక్షలు తెలిపి ఏ విధంగా సర్ప్రైజ్ ఇచ్చాడో, జగన్ కూడా బాబుకు ఇప్పుడు అదే రీతిలో సర్ప్రైజ్ ఇచ్చాడు.


"చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ గారు మరియు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్లో తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: