టాలీవుడ్ సినీ రంగంలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకుని మెగా అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. సమాజం మీద.. మనుష్యుల సమస్యల మీద ఎంతో అవగాహన ఉన్నట్టు చాలా వేదికలపై ప్రసంగించారు. దీంతో 2014 ఎన్నికలలో జనసేన పార్టీ స్థాపించి సంచలనం సృష్టించారు. ఆ సందర్భంలో ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు తెలిపి...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు.
Image result for pawan kalyan chandrababu naidu
అయితే తరువాత కొంతకాలం చంద్రబాబుకి ఆయన చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జై  కొడుతూ రాజకీయాల లో రాణించారు. అయితే తరువాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీని విభేదించారు. కారణం దేనికంటే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న అవినీతి అక్రమాలు రాష్ట్రంలో పెరిగిపోవడంతో..తండ్రి-కొడుకుల పై గుంటూరు జనసేన ఆవిర్భావ సభ దినోత్సవం నాడు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Image result for pawan kalyan at film chamber
దీంతో చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా పవన్ కళ్యాణ్ నిత్యత్వాన్ని టార్గెట్ చేసి..విచిత్ర మైన కథనాలను ప్రసారం చేస్తూ సమాజంలో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని తగ్గించాలన్ను కొన్నారు. దీనిలో భాగంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ వివాదం పై పోరాడుతున్న శ్రీ రెడ్డిని ఎల్లో మీడియా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిసి పవన్ కళ్యాణ్ పై ఉసిగొలిపారు.
Image result for pawan kalyan rgv
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఆయన అనుకూల మీడియా ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఏకిపారేశారు. అయితే ఈ క్రమంలో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ మీడియా ఛానల్ ఉండాలని భావిస్తున్నారట. మరికొద్ది  రోజులల్లో పవన్ కళ్యాణ్ మీడియా రంగంలో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: