పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆయన తల్లిని ఉపయోగించి శ్రీరెడ్డి దూషించిన సంగతి తెలిసిందే. అసలు కాస్టింగ్ కౌచ్ పై ఏ సంబంధంలేని పవన్ పై శ్రీరెడ్డి అనుచితవాఖ్యలు చేయడం ఇటు పవన్ అభిమానులకు, అటు అతన్ని అనుసరించేవారికి ఆగ్రహాన్ని పుట్టించింది. శ్రీరెడ్డి మీద మాటల దాడి ఎక్కువవడంతో, ఆమెతోఅలా  మాట్లాడించింది నేనే అంటూ వీడియో పెట్టి బాంబు పేల్చాడు దర్శకుడు వర్మ.

దీనికి స్పందించిన పవన్ దీని వెనుక రాంగోపాల్ వర్మతో పాటు మరో నలుగురు పథకం రచించారని చెప్పి షాక్ కు గురిచేశాడు. శ్రీరెడ్డి మాటలను తమ చానెళ్ళలో పదేపదే ప్రసారంచేసి టీవీ9 ఓనర్ శ్రీని, టీవీ9 రవిప్రకాష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లు తన తల్లిని అవమానించారని, మంత్రి లోకేష్ వీరికి నాయకుడు అంటూ ట్విట్టర్లో పేర్లు బయటపెట్టాడు. 


ఆయన ట్విట్టర్ ఆరోపణలను ఆధారంగా చేసుకొని టీవీ9 ఓనర్ శ్రీని ఆయనకు నేడు లీగల్ నోటీసులు పంపారు. శ్రీని ఎన్నడూ ఛానెల్ వ్యవహారాల్లో తలదూర్చలేదు. అసలు ఛానెల్ బోర్డు మీటింగులకు కూడా హాజరవలేదు. ఆయన ఛానెల్ నుండి బయటకి వద్దాం అని అనుకుంటున్న  సమయంలో పవన్ ఇలాంటి నిరాధార వాఖ్యలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ ఈ మేరకు శ్రీని తరపు న్యాయవాది సునీల్ రెడ్డి నోటీసులు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: