ఇంతకుముందు వరకు తనపై ఎవరు, ఎప్పుడు, ఎలాంటి  విమర్శలు, వాఖ్యలు చేసినా ఎన్నడూ ధీటుగా స్పందించలేదు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పడు తన తల్లిని అడ్డంపెట్టుకొని తనను దూషింపజేసి తన పేరును అప్రతిష్టపాలు చేయడానికి పన్నాగం పనిన వ్యక్తుల గురించి ట్విట్టర్లో  సంచలన విషయాలను తెలుపుతూ తనదైన రీతిలో వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.


ఒక మహిళ అని కూడా చూడకుండా శ్రీరెడ్డి తన తల్లిని ప్రస్తావిస్తూ చేసిన వాఖ్యలను రోజంతా అదే పనిగా పదేపదే ప్రసారం చేసిన ఛానెళ్ళను బాయ్ కాట్  చేయాలనీ ఈ మేరకు పవన్ ట్విట్టర్లో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం టీవీ9 రవిప్రకాశ్ ను టార్గెట్ చేశాడు. 


ఆయన ట్విట్టర్లో " శ్రీమతి రవి ప్రకాష్ గారికి నమస్కారాలు. మీ ఆయన చాలా మంచోడమ్మా! కానీ నీ పిల్లలు టీవీ9 లో ప్రసారమయ్యే కార్యక్రమాలు చూడకుండా ఉండేలా జాగ్రత్త వహించు. ఇలా ఎందుకని నీకు అనుమానం రావొచ్చు, అందుకే ఈ తరువాతి వీడియో" అంటూ రాసుకొచ్చాడు. ఇక ఆ వీడియోలో ఒక వ్యక్తి రవిప్రకాశ్ కాళ్ళు  పట్టుకొని అర్థిస్తున్నట్లుగా ఉంది. అసలు దీనివెనుక నడచిన తతంగం ఏంటి అని ఇంకో ట్వీటులో రవిప్రకాష్ కు పవన్ ప్రశ్న సంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: