ఈ సారి ఎలాగయినా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజానికానికి చేరువవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నాడు. కాగా నిన్నటి  యాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.


ఆయన తన ఫేస్ బుక్ పేజీలో - " కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో ఎంత బలంగా ముద్రవేసుకపోతాయో పాదయాత్రలో ఓ అనుభవం పట్టిచూపింది. చేతిలో పలకపట్టుకొని ఓ ఏడేళ్ళబాలుడు తన తండ్రితో పాటు నన్ను కలిశాడు. ఆ పలక మీద వైయస్సార్ అని అక్షరాలు కనిపించాయి. ఆసక్తి కలిగి ఏంటా అని ఆరా తీసాను. ఆశ్చర్యపోవడం నా వంతయింది".


"ఐదేళ్ల కిందట ఆ చిన్నారి నషీర్ తో అక్షరాభ్యాసం చేయిస్తూ నేను దిద్దించిన అక్షరాలట. అప్పుడు అఆ లు దిద్దించబోతే వారించి మరీ వైఎస్సార్ అని దిద్దించుకున్నారు. పలకపై అక్షరాలు చెరిగిపోనివ్వకుండా ఐదేళ్ల తరువాత మళ్లీ తెచ్చి చూపించడం ఆనందాన్ని కలిగించింది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ చిన్నారిని ఆశీర్వదించాను. పలకపై వైఎస్సార్ అక్షరాలను, హృదయపలకపై నాన్నగారి ప్రేమను భద్రపరచుకున్న విస్సన్నపేట తండ్రికొడుకులకు శుభకాంక్షలు తెలిపి ముందుకి నడిచాను" అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: