ఇతరులు తనపై నిందలుమోపుతున్నా, అవమానిస్తున్నా, దూషిస్తున్నా లేక స్థాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నా ఒక మనిషి ఓర్పు, సహనంతో ఉన్నాడంటే అతను చేతకానివాడైనా ఉండాలి లేక వారిని భవిష్యత్తులో ఎలా చెడుగుడు ఆడుకోవాలి అనే పథకం రచిస్తూ అయినా ఉండాలి. సరిగ్గా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అయితే పవన్ సహనాన్ని చేతకానితనం గా తీసుకున్న వారందరూ ఇప్పుడు వణికిపోతున్నారు.


వరుసగా ట్వీట్లు పెడుతూ తనను అవమానించిన వారి భరతం పడుతున్నాడు. పవన్ ట్వీట్లను క్షుణ్ణంగా పరీశిలించి చూస్తే ఆయన ఎప్పటినుండో ఇలా ట్వీట్ల దాడికి సన్నద్ధం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్కా ప్లానింగ్ తో వెళుతూ దశలవారీగా ఒకొక్కరి గురించి రహస్యభాగోతాలను బయటపెడుతున్నాడు.


తన ట్వీట్ల ద్వారా ఇన్నాళ్లు కొన్ని మీడియా సంస్థల అధినేతలకు ముచ్చెమటలు పట్టించిన పవన్ తాజాగా తన ట్వీటు ద్వారా పరోక్షంగా చంద్రబాబుకు కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. "ప్రపంచంలో గల లీడర్లలో "లీ కుయాన్ యు" నన్ను అత్యంత ప్రేరేపించిన  వ్యక్తి. సింగపూర్ ను ఎలా నిర్మించారు అని తెలుసుకొనే ముందు ఈయన జీవితచరిత్రని తెలుసుకో" అని ట్వీటు చేశాడు. ఎప్పుడూ ఏపీకి  సింగపూర్ లాంటి రాజధానిని కట్టిస్తాను అని చెప్పే బాబుకు కౌంటర్ గా పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. నెటిజన్లు సైతం బాబుని ఈ ట్వీట్ కి ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: