ఏపీ ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ గతి ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి వుంటే తమకు కూడా అదే గతి పడుతుందేమో అని భావించిన టీడీపీ, ఎన్డీఏ కూటమి నుండి బయటకి వచ్చింది. అయితే ఎన్డీఏతో రాష్ట్రంలోని రాజకీయపార్టీల పొత్తుల గురించి కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే స్పందించారు. ఈరోజు విజయవాడ వచ్చిన ఆయన ఆంధ్రా రాజకీయాలపై కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు.


ఎన్డీయే నుండి టీడీపీ బయటికిరావడం  తొందరపాటు చర్యగా రాందాస్‌ అథవాలే అభివర్ణించారు. త్వరలోనే మోడీ ఏపీకి  నిధులివ్వనున్నట్లు ఆయన తెలిపాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అయినా టీడీపీ, ఎన్డీయే కూటమిలో కలవాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవాలని ఆయన కోరారు.


ఒకవేళ తమతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించినట్లయితే జగన్ ను సంప్రదిస్తామని తెలిపాడు. ఏపీలో జగన్ కు చాలా బలముందని అందుకే బాబు ఒప్పుకోకపోతే జగన్ తో పొత్తుపెట్టుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్‌ కేసుల ప్రస్తావన వచ్చినప్పుడు..ఆ కేసులు  నిరూపితం కాలేదని, అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: