ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. గత ఎన్నికలలో నెరవేర్చలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టడం తో..తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో సొంతపార్టీ నేతలే చంద్రబాబుని లెక్కచేయడం లేదు.
Related image
తాజాగా ఇటీవల బిజెపి పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్న క్రమంలో..కన్నా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణను టిడిపి లోకి తీసుకు రావడానికి చంద్రబాబు ఒక మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు నేత ప్రదర్శించిన అలసత్వం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశం అయింది.
Related image
చంద్రబాబు పచ్చజెండా ఊపినా టిడీపీ ముఖ్య నేతలు సకాలంలో స్పందించకపోవడం కన్నాను వారు వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇదే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్. కన్నాతో డీల్ కోసం మాట్లాడిన ఓ మంత్రి ఆ తర్వాత దాన్ని వదిలేశారు. దాంతో కన్నా లక్ష్మినారాయణ తన దారి తాను చూసుకొన్నారని సమాచారం.
Image result for chandrababu
అయితే దీనంతటికీ కారణం ప్రస్తుతం చంద్రబాబు పేరు వింటేనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత భావము ఉన్న నేపథ్యంలో...మంత్రి పార్టీ మారడానికి ఇలా చేస్తున్నారనే వార్తలు మరోపక్క వినపడుతున్నాయి. దీంతో చంద్రబాబు చెప్పిన మాటలు లెక్క చేయడం లేదు అని అంటున్నారు కొందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: