లోకేష్ మైక్ తీసుకుంటే తెలుగు లో ఎంత అనర్గళంగా మాట్లాడ గలడో మనకందిరికి తెలిసిందే. తన కంటే ఒకటో తరగతి పిల్లడు నయం అనిపిస్తుంటుంది. అయితే ఇక లోకేష్ సంస్కారం గురించి ఎంత తక్కువ చెబితే అంత తక్కువ. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ అవి కొన్ని హద్దుల్లో ఉండాలి. మీనింగ్ అయిఉండాలి. కానీ లోకేష్ కు అవన్నీ అవసరం లేదు తాను ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటాడు. అయితే తిరుపతి భహిరంగ సభలో లోకేష్ ఆవేశంగా ఇందిరా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరిచినాడు.

Image result for lokesh

దేశ ప్రధానిగా చేసిన దివంగత నేత గురించి ఇంత దారుణంగా మాట్లాడిన లోకేష్‌ 'కుసంస్కారి' అని అర్థమవుతోంది కదా. ఇందిర గురించి, ఆమె పాలన గురించి రాజయాల్లో 'బచ్చా' అయిన లోకేష్‌కు తెలుసా? ఆమెను గురించి మాట్లాడే అర్హత ఉందా? లోకేష్‌ 1983 జనవరి 23న పుట్టాడు. ఇందిరా గాంధీ 1984 అక్టోబరు 31న మతోన్మాద ముష్కరుల తూటాలకు నేలకొరిగారు. అప్పుడు లోకేష్‌ వయసు రెండేళ్ల కంటే తక్కువే.

Image result for lokesh

కనీసం మాటలైనా వచ్చుండవు. ఒంటి మీద లాగు, చొక్కా అయినా సరిగా ఉన్నాయా? తెలుగులో నాలుగు మాటాలు సరిగా మాట్లాడలేని ఈయన ఇందిరను దూషించేవాడయ్యాడు. తన తండ్రికి రాజకీయాల్లోకి ప్రవేశం కల్పించింది ఇందిరా గాంధీయేనని, మంత్రిని చేసింది ఆమేనని లోకేష్‌కు తెలుసా?'తెలుగు జాతితో పెట్టుకొని ఇందిరా గాంధీ మాడి మసైపోయారు' అని వీరావేశం ప్రదర్శించాడు. రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన పార్టీని అవకాశవాదంతో వదిలిపెట్టి మామ పెట్టిన టీడీపీలో చేరారు. మామ మీదే పోటీ చేస్తానని ఆయన పంచన చేరిపోయారు. చెప్పిన మాటలకు కట్టుబడకుండా యూటర్న్‌ తీసుకోవడం అప్పటినుంచే ప్రారంభించిన బాబు ఇప్పటివరకు కొనసాగిస్తూనేవున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: