సాధారణంగా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే వెళుతుంటారు..అది కూడా చాలా అఫిషియల్ ఉన్నవాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.  ఈ మద్య ఉన్నతాధికారులు కాస్త ఎంట్రటైన్ మెంట్ విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఆ మద్య కలెక్టర్ స్థాయిలో ఉన్నవారు స్టేజ్ షో లో కూడా డ్యాన్స్ వేసి సందడి చేశారు.  తాజాగా దివ్యా దేవరాజన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  ప్రతిరోజూ అధికారులు, ప్రజా కార్యక్రమాల్లో బిజీగా గడిపే దివ్యా దేవరాజన్ ఓ పెళ్లిలో చేసిన సందడి ఇప్పుడు వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే..దివ్యా దేవరాజన్ వద్ద అటెండర్ పెళ్లి వేడుకలో గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి సరదాగా గడిపారు. సుధాకర్ అనే వ్యక్తి ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన పెళ్లికి కలెక్టర్‌ను ఆహ్వానించగా... ఆమె గుడిహత్నూర్ మండలం గోపాల్‌పూర్ వెళ్లారు. గిరిజన సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించారు.  జిల్లా అధికారి అయి ఉండి కూడా ఓ అటెండర్ పెళ్లికి రావడమే కాకుండా డ్యాన్స్ చేయడం అందరికీ ఆశ్చర్యం..సంతోషాన్ని కలిగించింది. గిరిజన సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించారు.

గిరిజనుల సంప్రదాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందరు మహిళలతో పాటూ కిందే కూర్చొని అబ్బురపరిచారు. ఓ కలెక్టర్ అయినా కూడా దర్పం లేకుండా తమతో కలిసిపోయారంటూ సుధాకర్ బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక వివాహానంతరం కొత్తజంటతో కలిసి అక్కడి సాంప్రదాయ నృత్యం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంలో మహిళలంతా కలిసి నృత్యం చేస్తుంటే..దివ్యా దేవరాజన్ కూడా కలిసి వారితో పాదం కలిపారు.  కాసేపు వారితో కలిసి నృత్యం చేశారు. తర్వాత సుధాకర్ బంధువులతో ఫోటోలు కూడా దిగారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: