మోస్ట్ ఎవైటింగ్ బ్యాచిలర్ రాహుల్ గాంధీ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనం సృష్టిస్తూనే ఉంది. అయితేతన పెళ్లిపై రాహుల్ మాత్రం ఏనాడూ స్పందించలేదు 40లలోకి ఎంటరైనా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే ఓ ఎమ్మెల్యేను రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Image result for raebareli mla aditi singh

          ప్రస్తుతం కర్నాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంగా రాహుల్ అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కర్నాటక ఎన్నికలు కర్టెన్ రైజర్ గా భావిస్తున్నందున ఏ చిన్న అవకాశాన్నీ రాహుల్ వదులుకోవడం లేదు. రాహుల్ కర్నాటకలో బిజీబిజీగా గడుపుతున్న సమయంలో ఆయన పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Image result for raebareli mla aditi singh

          కర్నాటక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ వార్త సారాంశం. అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ ఎమ్మెల్యేను వివాహం చేసుకోబోతున్నారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. రాయ్ బరేలీ ఎమ్మెల్యే ఆదితీ సింగ్ ను కర్నాటక ఎన్నికల తర్వాత రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఆదితీ సింగ్ రాహుల్ సోదరి ప్రియాంకా వాద్రాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా.! దీంతో ఈ పెళ్లి వార్తకు మరింత బలం చేకూరింది.

Image result for aditi singh with rahul gandhi

          అయితే.. ఈ పెళ్లి వార్తపై రాహుల్ స్పందించలేదు కానీ, ఆదితీ సింగ్ మాత్రం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వార్తలు చాలా బాధాకరమని పేర్కొంది. రాహుల్ నాకు రాఖీ బ్రదర్ అన్న ఆదితీ.. ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని రిక్వస్ట్ చేసింది. గత ఎన్నికల్లో రాయ్ బరేలీ స్థానం నుంచి ఆదితీ 90 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. విదేశాల్లో చదువుకున్న ఆదితి.. ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాయ్ బరేలీ ప్రజలు మాత్రం ఆదితిని రాహుల్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందుకే అక్కడే ఈ వార్త పుట్టిందని, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: